మనసున కలిగే హాయివో
మది కదిలించే బాధవో
మనిషిగా మలచే ప్రేమవో
హృదయంలో నీ రూపమేలె
యద సడిలో నీ పేరేలె
ఆలోచనలో నువ్వెలె
నేనంత ఇక నీకేలె
తెలియక నేను ఇన్నాళ్ళు
అటు ఇటు తిరిగ ఇన్నేళ్ళు
కనులను మూస్తే నీ కలలు
కనపడెను నీ అధరాలు
నువ్వొస్త అంటే నా కోసం
ఒక యుగమైన నే నీ కోసం
వేచుంటాను నే కలకాలం
నిను పొందడమే మరి నా లక్ష్యం
ఎదురు చూస్తూ .............
Bawa.. Nuvvu kiraak ra
ReplyDelete