Tuesday, 9 December 2014

నీ ఊహల్లో

 
మాటలకందని మాయవో
మనసున కలిగే హాయివో 
మది కదిలించే బాధవో 
మనిషిగా మలచే ప్రేమవో 

హృదయంలో నీ రూపమేలె
యద సడిలో నీ పేరేలె
ఆలోచనలో నువ్వెలె 
నేనంత ఇక నీకేలె 

తెలియక నేను ఇన్నాళ్ళు 
అటు ఇటు తిరిగ ఇన్నేళ్ళు 
కనులను మూస్తే నీ కలలు 
కనపడెను నీ అధరాలు 

నువ్వొస్త అంటే నా కోసం 
ఒక యుగమైన నే నీ కోసం 
వేచుంటాను నే కలకాలం 
నిను పొందడమే మరి నా లక్ష్యం

ఎదురు చూస్తూ  .............