Wednesday, 21 January 2015

ప్రేయసికై నా ప్రేమ


వెన్నెల్లు తెచ్చి నీకివ్వనా 
వజ్రాల గుడిని కట్టివ్వనా 
విరజాజి పూలు కోసివ్వనా
వెయ్యేళ్ళు నీ తోటి ఉండనా

వనమంటి నా గుండెలోన
వెలుగల్లె వచ్చావు మైన
వరసైన నీ గుండెలోన
వెచ్చంగ నేనుండిపోన

వివరించలేనంత ప్రేమ
వెలకట్టలేనంత ప్రేమ
విషమిచ్సినా పోని ప్రేమ
విని చూడు నా మనసు భామ

వికసించెను ప్రేమ పుష్పం
విరజిమ్మేను  కుసుమ గంధం
విలువైన నీ ప్రేమ కోసం
వదిలేయన నేను ప్రాణం ...